ప్రోత్సహించే దిశగా మరింత పారదర్శకంగా విధానాలను అమలు చేస్తాం-పీయూష్ గోయల్

VARTHA VIHARI NEWS:ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా పారిశ్రామిక వేత్తలతో జరిగిన ముఖాముఖిలో పారిశ్రామికవేత్తలు కొత్త ఆలోచనలతో ఆర్థిక కార్యకలాపాల నిర్వహణ అంశంపై జరిగిన చర్చా కార్యక్రమం రానున్న రోజుల్లో మరింత మంచి పారిశ్రామిక విధానాలు తీసుకుని వచ్చేందుకు తోడ్పడుతుందని కేంద్ర రైల్వే, వాణిజ్య,పరిశ్రమల శాఖా మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. శుక్రవారం ఉదయం స్థానిక గ్రాండ్ రిడ్జ్ హోటల్ లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై పారిశ్రామికవేత్తలతో జరిగిన ముఖాముఖి కార్యక్రమం అనంతరం విలేఖరుల సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ పారిశ్రామిక వేత్తలతో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి పారిశ్రామికవేత్త వారి వినూత్న ఆలోచనను తెలుపడంతో ఈ కార్యక్రమం విజయవంతమైందన్నారు. ఈ-వెహికల్స్ మీద త్వరలో ప్రభుత్వపాలసీ ని ప్రకటిస్తామని, ఆంధ్రప్రదేశ్ లో వ్యవశాయ ఆదారిత పరిశ్రమలను అభివృద్ధి చేసేందుకు అవసరమైన అన్నీ వసతులు కలవన్నారు. ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం పూర్తి సహకారాలను అందిస్తుందన్నారు. రాష్ట్ర పరిశ్రమల , ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం పరిశ్రమ స్థాపన ద్వారా ఎక్కువమందికి ఉపాధి కల్పించే దిశగా కృషిచేస్తున్నదని పారదర్శకమైన పాలనను అందిస్తామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!