ఆంధ్రప్రదేశ్ ను పారిశ్రామికీకరణగా ముందుకు తీసుకుపోవడమే ముఖ్యమంత్రి లక్ష్యం: మంత్రి మేకపాటి గౌతంరెడ్డి

VARTHA VIHARI NEWS:ఆంధ్ర ప్రదేశ్ పరిశ్రమలు, కామర్స్ శాఖ ఆధ్వర్యంలో పరస్పర సులభ పద్ధతిలో వ్యాపారం చేయడంపై తిరుపతిలోని గ్రాండ్ రిడ్జ్ హోటల్ నందు ఈరోజు సెమినార్ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సెమినార్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధిగా పరిశ్రమలు కామర్స్ మరియు ఐటీ శాఖా మాత్యులు శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా కేంద్ర పరిశ్రమలు కామర్స్ మరియు రైల్వే శాఖ మంత్రివర్యులు శ్రీ పీయూష్ గోయల్ గారు హాజరు కావడం జరిగింది. ఈ సెమినార్లో దేశ విదేశాల పెట్టుబడిదారుల ప్రతినిధులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర మంత్రులు ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమల స్థాపనకు సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర రాష్ట్ర పరిశ్రమల అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!