తన సస్పెన్షన్ గురించి ప్రస్తావించిన ఎమ్మెల్యే రోజా…..

VARTHA VIHAIR NEWS:అసెంబ్లీ సమావేశాల రెండో రోజు స్పీకర్ ఏకగ్రీవ ఎంపికపై అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో తనపై ఏడాదిపాటు స్పీకర్ సస్పెన్షన్ వేటు వేసి అత్యున్నత స్థానాన్ని దుర్వినియోగం చేశారని రోజా ఆరోపించారు. కాల్ మనీ, సెక్స్ రాకెట్ వల్ల మహిళలు పడుతున్న బాధల గురించి ప్రశ్నించిన తన గొంతును నొక్కేందుకు స్పీకర్ పదవిని వాడుకున్నారని రోజా అన్నారు. సుప్రీం కోర్టు తనకు అనుకూలంగా తీర్పునిచ్చినా.. తనను సభలోకి రాకుండా అడ్డుకున్నారని గుర్తు చేశారు. అలాంటి వాళ్లు విలువల గురించి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని రోజా విమర్శించారు.

తమ ముఖ్యమంత్రి బీసీలపై ఎంతో గౌరవంతో వెనుకబడిన వర్గాలకు చెందిన వ్యక్తిని స్పీకర్ చేశారని, స్పీకర్‌గా ఎంపికైన తమ్మినేనికి రోజా శుభాకాంక్షలు తెలియజేశారు. గతంలో లాగా ప్రజాసమస్యలపై మాట్లాడేవారి గొంతును నొక్కడంలాంటివి చేయకుండా అందరికీ మాట్లాడే అవకాశం ఇస్తారని కోరుతున్నానని రోజా అన్నారు. సభాపతి స్థానం తండ్రి స్థానం లాంటిదని, తండ్రి తన పిల్లలందరినీ ఎలా సమానంగా చూస్తారో.. అలాగే సభ్యులందరినీ సమానంగా చూడాలని స్పీకర్‌ను ఎమ్మెల్యే రోజా కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!