కోటంరెడ్డి రెండుసార్లు ప్రమాణం ఎందుకు..?

VARTHA VIHARI NEWS : ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి… ప్రొటెం స్పీకర్ నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రమాణస్వీకారం చేయించారు. అయితే, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రెండు సార్లు ప్రమాణస్వీకారం చేయాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు రూరల్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తొలిసారి ప్రమాణస్వీకారం చేసినప్పుడు దైవసాక్షిగా అనడానికి బదులు.. నా ఆరాధ్య నాయకుడు జగన్మోహన్ రెడ్డి సాక్షిగా అంటూ ప్రమాణస్వీకారం చేశారు. నిబంధనల ప్రకారం ప్రమాణ పత్రంలో ఉండే దైవ సాక్షిగా లేదా ఆత్మసాక్షిగా అని తప్ప వేరే ఏ ప్రస్తావన చేసినా ప్రమాణం చెల్లదు. దీంతో శ్రీధర్‌రెడ్డితో రెండోసారి ప్రమాణం చేయించారు ప్రొటెం స్పీకర్. ఇక, 2009లో ఇలాగే ప్రమాణం చేసిన 8 మంది ఎమ్మెల్యేలతో తిరిగి ప్రమాణస్వకారం చేయించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!