కండిషన్లో లేని పాఠశాలలు, కళాశాలలు బస్సుల పై చర్యలు తీసుకోవాలి : ఏబీవీపీ ఆర్ టి ఓ చంద్ర

VARTHA VIHARI NEWS:నెల్లూరు జిల్లా గూడూరులో కండిషన్లో లేని పాఠశాలలు, కళాశాలలు బస్సుల పై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆర్ టి ఓ చంద్ర వినతి పత్రం అందించడం జరిగింది.అఖిల భారత విద్యార్థి పరిషత్ ఎబివిపి గూడూరు శాఖ ఆధ్వర్యంలో స్థానిక రవాణా శాఖ కార్యాలయంలో ఆర్ టి ఓ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా కన్వీనర్ మనోజ్ కుమార్ మాట్లాడుతూ, గూడూరు డివిజన్ పరిధిలోని కండిషన్లో లేని పాఠశాలలు, కళాశాలల బస్సుల పై చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. కొన్ని పాఠశాలలు కళాశాలలు బస్సులు వేరే రాష్ట్రం నుండి కండిషన్లో లేని పాత బస్సులను కొనుగోలు చేసి మెరుగులు దిద్ది వాటిని నడుపుతున్నారని మరియు అధిక సంఖ్యలో కెపాసిటీ మించి విద్యార్థులను బస్సుల్లో ఎక్కించుకొని బస్సులు నడుపుతున్నారు.పాఠశాలలు కళాశాలల పై చర్యలు తీసుకోవాలని వారు కోరారు వెంటనే స్పందించిన ఆర్ టి ఓ కండిషన్లో లేని బస్సులు నడిపిన మరియు అధిక సంఖ్య నుంచి విద్యార్థులను బస్సులో ఎక్కించుకొని వారి మీద చర్యలు తీసుకుంటామని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చిన్న నగర అధ్యక్షులు దొరబాబు ఏబీవీపీ కార్యకర్తలు రవి కోటయ్య తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!