రోజాకు కీలక పోస్ట్……

VARTHA VIHARI NEWS:నగరి వైసీపీ ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజుకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక పదవి ఇచ్చారు. తొలి కేబినెట్‌లో అవకాశం దక్కకపోవడంతో అలకబూనిన రోజాను బుజ్జగించిన సీఎం జగన్.. చివరకు ఆంధ్రప్రదేశ్ మౌళిక వ‌స‌తుల అభివృద్ది సంస్థ (ఏపీఐఐసీ) ఛైర్‌పర్సన్‌గా నియమించారు. నూత‌న రాష్ట్రం.. నూత‌న ప్ర‌భుత్వం ఏర్పాటైన ఏపీలో పారిశ్రామిక అభివృద్ది కోసం తీసుకొనే నిర్ణయాల్లో కీల‌క భూమిక పోషించే ఏపీఐఐసీ ఆమెకు కట్టబెట్టారు. కాగా, రోజా ముందు మూడు సీఎం జగన్ మూడు ఆఫర్లు పెట్టినట్టు తెలుస్తోంది. ఏపీఐఐసీ, ఆర్టీసీ, మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్లలో ఏదో ఒకటి తీసుకోవాలని జగన్ సూచించగా.. ఆమె మీ ఇష్టం అంటూ నిర్ణయాన్ని సీఎం జగన్‌కే వదిలేసినట్టు తెలుస్తోంది. దీంతో రోజాను సీఎం జగన్.. ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్‌గా నియమించారు. తనకు కీలక పదవి అప్పగించిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు రోజా.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!