8వేల కేసులు పెట్టారు.. గతాన్ని మరచి విమర్శలేంటి? – ఉమ్మారెడ్డి

VARTHA VIHARI NEWS : చంద్రబాబు కొద్ది రోజులు కూడా ఓపిక పట్టడం లేదని.. వైసీపీ దాడులు చేస్తోందంటూ అనవసర విమర్శలు చేస్తున్నారని వైసీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. నేడు అసెంబ్లీ తొలి సమావేశాల సందర్భంగా ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో వైసీపీ శ్రేణులపై 8వేల కేసులు పెట్టారన్నారు. వైసీపీ నేత చెరుకులపాడు నారాయణ రెడ్డిని హత్య చేశారని ఆరోపించారు. గతాన్ని మరిచి టీడీపీ విమర్శలు చేయడమేంటని ఉమ్మారెడ్డి నిలదీశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!