ఆ పుస్తకం ఆవిష్కరించడం నా అదృష్టం: సీఎం జగన్

VARTHA VIHARI NEWS : డాక్టర్ సి. నారాయణరెడ్డిపై రాసిన ‘పెద్దల సభలో తెలుగు పెద్ద’ అనే పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నారాయణ రెడ్డి గురించి అందరికీ తెలుసునని, తాను పెద్దగా చెప్పనవసరంలేదని అన్నారు. నారాయణరెడ్డిపై రాసిన పుస్తకం తన చేతుల మీద ఆవిష్కరించడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత అయిన ఆయన గురించి, ఆయన రాసిన కవితలు, మాటలు గురించి తాను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ అవకాశం తనకు కల్పించినందుకు సభకు విచ్చేసిన పెద్దలందరికీ జగన్ కృతజ్ఞతలు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!