సమస్యలు పరిష్కరించే దిశగా ఎమ్మెల్యే వరప్రసాద్……

VARTHA VIHARI NEWS : గూడూరు మున్సిపల్ ఆఫీసులో మంగళవారం ఎమ్మెల్యే వరప్రసాద్,మున్సిపల్ చైర్మన్ పోణకా దేవసేనమ్మ,నగర మున్సిపల్ కమిషనర్ రవి మరియు కౌన్సిలర్ల ఆద్వర్యంలో జరిగిన సమావేశంలో నగరంలో తీసుకోవలిసిన పలు అభివృద్ధి కార్యక్రమాల మీద సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా నగరంలోని ప్రధాన మార్కెట్లు అయిన కూరగాయలు,చేపల మార్కెట్లలో సరైన వసతులు లేక వర్షాకాలంలో వినియోగదారులు,వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాటి పరిష్కారానికి తీసుకోవాలిసిన చర్యలు గురించి చర్చించారు. తాత్కాలికంగా మార్కెట్లో ఫ్లోర్ కొంచెం ఎత్తు పెంచి,రేకులు సవరించి,మరుగుదొడ్లు నిర్వహణ సరిగ్గా చేపట్టే విధంగా ఇద్దరు స్వీపర్లు అక్కడ ఉంచే విధంగా చూస్తామన్నారు..అలాగే నగరంలో పలువార్డుల్లో చేయవాలిసిన అభివృద్ధి పనుల మీద కూడా చర్చించారు.ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు నాసిన నాగులు,రమేష్ పలువురు కౌన్సిలర్ లు,మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!