ఆత్మపరిశీలన చేసుకోవాలి మాజీ మంత్రి సోమిరెడ్డి…….

VARTHA VIHARI NEWS:తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ఆత్మపరిశీలన చేసుకోవాలని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. సోమవారం హిందూపూర్ శాసన సభ్యుడు సినీ నటుడు నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలలో భాగంగా పాల్గొన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ, మొన్న జరిగిన ఎన్నికల్లో ఘోరపరాజయం కావడానికి కారణాలపై మనకు మనమే ఆత్మపరిశీలన చేసుకోవాలని సోమిరెడ్డి అన్నారు. అదేవిధంగా అనుకున్నదానికంటే చాలా ఘోరంగా పరాజయం పాలవడం జరిగిందని, ఇటువంటి సమయంలో పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఎవరు కూడా అధైర్య పడకుండా రాబోవు రోజుల్లో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసి ముందుకుపోవాలని కార్యకర్తలకు సోమిరెడ్డి తెలిపారు. అదేవిధంగా జిల్లాలో గెలుపొందిన పదిమంది వైకాపా శాసనసభ్యులకు, ఇద్దరూ పార్లమెంట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు సోమిరెడ్డి. మరియు జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కడం పై హర్షం వ్యక్తం చేశారు, మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, గౌతమ్ రెడ్డి లకు కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే ఇద్దరు మంత్రులు జిల్లాను అభివృద్ధి పథంలో తీసుకోవాలి కానీ కక్షసాధింపు చర్యలు చేపట్టకూడదని సోమిరెడ్డి హితవు పలికారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *