సైదాపురం మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధి కమిటీ చైర్మన్ రాజీనామా…

VARTHA VIHARI NEWS : నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం ఉదయం హాస్పిటల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ శ్రీ మేకల కృష్ణం నాయుడు పదవికీ రాజీనామా చేశారు.తన రాజీనామా లేఖను డాక్టర్ పాల్ జాన్సన్ గారికి అందజేశారు. అనంతరం కృష్ణం నాయుడు మాట్లాడుతూ “నా పదవీ కాలంలో నాకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించిన గౌరవనీయులు శ్రీ కురుగొండ్ల రామకృష్ణ గారికి మరియు మండల నాయకులకు, ప్రజలకు మరియు హాస్పిటల్ డాక్టర్ గారికి, హాస్పిటల్ సిబ్బందికి కృతజ్ఞతలు” తెలియజేశారు.  అలాగే 2019 ఎన్నికల్లో వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందిన శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి తమ శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!