ఆసుపత్రి కమిటీకి షంషుద్దీన్ రాజీనామా…..

VARTHA VIHARI NEWS : జిల్లా ప్రభుత్వ సర్వజన ప్రధాన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ డైరెక్టర్ షేక్ షంషుద్దీన్ తన పదవికి రాజీనామా చేస్తూ, ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాసరావుకు రాజీనామా పత్రాన్ని సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా షంషుద్దీన్ మాట్లాడుతూ మంత్రి నారాయణ, మేయర్ అబ్దుల్ అజీజ్, ఛైర్మెన్ నరసింహారావుల సహకారంతో రోగులకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించి ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేశామని, నూతన పాలకవర్గం సారధ్యంలో ప్రజలకు ఉత్తమ సేవలు లభించాలని ఆకాంక్షించారు. బాధ్యతల నిర్వహణలో సహకరించిన ఆసుపత్రి వైద్యులు, సిబ్బందికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!