ప్రధాని మోదీకి కృతజ్ఞతలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి…..

VARTHA VIHARI NEWS :  ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలోని కందుకూరుమండలం పెద్ద మోపాడు గ్రామానికి చెందిన శ్రీ ముళ్లమూరి శ్రీను తండ్రి కోటయ్య తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ రాజ్యసభ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ని కలవడం జరిగినది. సమస్య తీవ్రతను పరిశీలించిన ఎంపీ ప్రభాకర్ రెడ్డి విషయమును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడి కి లేఖ రూపంలో తెలియజేయడం జరిగినది. ఇందుకు గాను స్పందించిన ప్రధానమంత్రి ముళ్లమూరి శ్రీను చికిత్స చేయించుటకు గాను తక్షణ సహాయం క్రింద మూడు లక్షల రూపాయలను విడుదల చేసినట్లు ఎంపీ కి లేఖ రూపంలో తెలియజేయడం జరిగినది. ఈ సందర్భంగా ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!