వైద్య రంగంలో అభివృద్ధి దిశగా పొదలకూరు…. కాకాణి పొదలకూరు

VARTHA VIHARI NEWS: వైద్య రంగంలో పొదలకూరు అభివృద్ధి దిశగా పయనిస్తోందని సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి అనుముల జయప్రకాష్ తనయుడు ఆదర్శ్ పొదలకూరు లో ఏర్పాటు చేసిన ఎలైట్ డెంటల్ క్లినిక్ ను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ రంగాల్లో నిపుణులైన డాక్టర్లు పట్టణాలకే పరిమితం కాకుండా పల్లెల్లో ప్రాక్టీసు ఏర్పాటు చేయడం శుభసూచకం అన్నారు. పొదలకూరు లో దంత వైద్య సేవలు అందించేందుకు ముందుకు వచ్చిన ఆదర్శ్ ను ఆయన అభినందించారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వైద్య చికిత్స అందించే వైద్యులు ప్రత్యక్ష దైవాలన్నారు .వైద్య వృత్తిలో ఉన్నంత సంతృప్తి మరే వృత్తిలోనూ ఉండదన్నారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి ఏ. జయ ప్రకాష్, ఏ సి ఎస్ ఆర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ. శ్రీహరి ,అసిస్టెంట్ ప్రొఫెసర్ కృష్ణమూర్తి, దంత వైద్యులు డాక్టర్ ఆదర్శ్ , రమ్య, కవిత తదితరులు పాల్గొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!