పసుపు యార్డును పునఃప్రారంభం చేయాలి….

VARTHA VIHARI NEWS:నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం పరిధిలోని బండాగానీపల్లి పంచాయతీలో గల కొత్తపల్లి ఎస్.టి.కాలనిలో బుధవారం నాడు రెత్తు సంఘం నాయకులు కాకు వెంకటయ్యగారి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కాకు వెంకటయ్యగారు మాట్లాడుతూ ఉదయగిరిలో పసుపు యార్డును పునఃప్రారంభించాలన్నారు. మంచినీటి సమస్య పరిష్కారం కోసం సీతారాం సాగర్ ప్రాజెక్టును నిర్మించాలని, ఉపాధి హామీ పథకం పనులు చేపట్టి గిట్టుబాటు కూలి , పేస్లిప్లు వచేట్లు చూడాలని, తదితర అంశాలపై ఈ రోజు ఎస్.టి.కాలనిలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సి.పి.ఎం.నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!