వీపీఆర్ విద్యాసంస్థల ఘన విజయం…..

VARTHA VIHARI NEWS:వీపీఆర్ విద్యాసంస్థ లో పదవ తరగతి చదువుతున్న నలుగురు విద్యార్థులు పదికి పది పాయింట్లు సంపాదించారని ఈ విజయం తమకు ఎంతో సంతోషం కలిగించిందని సమస్త సీఈవో ఆచార్య నారాయణ రెడ్డి తెలిపారు. బుధవారం మధ్యాహ్నం వీపీఆర్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో నారాయణరెడ్డి మాట్లాడుతూ, 2016 లో నెలకొన్న ఈ విద్యా సంస్థ అప్పటిలో ఎనిమిదవ తరగతి చేరిన విద్యార్థులు ఈ సంవత్సరం 30 మంది విద్యార్థులు పదవతరగతి పరీక్షలు రాయడం జరిగిందని ఇందులో నలుగురికి పది పాయింట్లు రాగా, 9 పాయింట్లు లోగా 22 మంది విద్యార్థులు సాధించారని మిగిలిన విద్యార్థులు 8.5 పాయింట్స్ సంపాదించారని నారాయణ రెడ్డి తెలిపారు. అయితే 2018, 2019 సంవత్సరము గాను పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు బి పి ఆర్ ఫౌండేషన్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, కో చైర్మన్ శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చొరవతో వారి దాతృత్వంతో నిరంతరం విద్యార్థులకు కావలసిన వసతులను ఏర్పాటు చేస్తూ వారి విద్యకు ఎటువంటి లోటు రానివ్వకుండా ఈ విజయాలు రావడానికి ముఖ్య కారణమని నారాయణ రెడ్డి తెలిపారు. ఇందుకుగాను సమస్త చైర్మన్, కో చైర్మన్ లకు కృతజ్ఞతలు తెలియజేశారు. విద్యార్థులు మాట్లాడుతూ, తమకు అన్ని సౌకర్యాలు కల్పించిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి , ప్రశాంతి మేడం లకు తమరు ఎప్పుడు రుణపడి ఉంటామని తెలియజేశారు. అదేవిధంగా అధ్యాపక బృందం పూర్తిగా బాధ్యతతో మమ్మల్ని ప్రోత్సహించారని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తెలియజేస్తూ, అధ్యాపక బృందానికి కృతజ్ఞతలు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీనివాస్, మరి అధ్యాపకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *