చంద్రబాబు చేయించిన నాలుగు సర్వేల్లో ఏం తేలింది..!?

VARTHA VIHARI NEWS:ఏపీ ఎన్నికల ఫలితాలపై టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు నాలుగు సర్వేలు చేయించారు. ఈ నాలుగు సర్వేల్లో కూడా టీడీపీ గెలుపు ఖాయమని తేలిపోయిందని స్వయానా చంద్రబాబే చెప్పుకొచ్చారు. సోమవారం ఉదయం నంద్యాల, కర్నూలు పార్లమెంటరీ సభ్యులు, నేతలతో చంద్రబాబు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఫలితాల రోజు ఎలా వ్యవహరించాలి..? ఏజెంట్లు ఎలా ఉండాలి..? అనేదానిపై బాబు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో భాగంగా ఆయన ఫలితాల గురించి మాట్లాడుతూ సర్వేల ప్రస్తావన తెచ్చారు. నంద్యాల, కర్నూలు రెండు లోక్ సభ సీట్లలోనూ టీడీపీ ఘన విజయం సాధిస్తోందని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

టీడీపీకే మేలైంది..!

లబ్ధిదారులకు చేయాల్సిన సంక్షేమం చేశాం. తొలివారంలో లబ్ధిదారులకు పించన్లు, ఆర్ధిక సాయం అందుతాయి. బీజేపీకి వ్యతిరేకంగా అన్నిపార్టీలను ఏకం చేశాం. మనం చేసిన కార్యక్రమాలే మనకు శ్రీరామ రక్ష. ప్రకృతి మనకు బాగా కలిసొచ్చింది. లబ్దిదారులకు చేయాల్సినంత సంక్షేమం చేశాం. ఈ ఎన్నికలు మే నెలలో రావాల్సివుంది. తొలిదశలో ఎన్నికపెట్టి మనల్ని ఇబ్బంది పెట్టాలని చూశారు. స్వల్ప గడువుతో టీడీపీని దెబ్బతీయాలని అనుకున్నారు. కానీ అదే తెలుగుదేశం పార్టీకి బాగా కలిసివచ్చింది. మంచికి మారుపేరు తెలుగుదేశం పార్టీ. దుర్మార్గాలకు మారుపేరు వైసీపీ, బీజేపీ. ఓడిపోతామని తెలిసి కూడా వైసీపీ బుకాయిస్తోంది. గత ఎన్నికల్లోనూ ఇలాగే డ్రామా ఆడారు. మే 23న కౌంటింగ్‌లో టీడీపీ గెలుపు లాంఛనం మాత్రమే. ఏపీలో తెలుగుదేశం పార్టీ విజయం తథ్యం అని చంద్రబాబు జోస్యం చెప్పారు.

మోదీ ప్రధాని అయ్యే ప్రసక్తే లేదు..
మళ్లీ నరేంద్రమోదీ ప్రధాని అయ్యే ప్రసక్తే లేదు. దేశంలో బీజేపీ ఓటమి ఖాయం అయ్యింది. మోదీ పాలనలో ఏపీకి జరిగిన అన్యాయంపై పోరాడాం. గత 5ఏళ్లలో దేశానికి జరిగిన నష్టంపై పోరాడాం. మొన్న పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీకి అనుకూలంగా ప్రచారం చేశాం. మళ్లీ నరేంద్రమోదీ ప్రధాని అయ్యే ప్రసక్తే లేదు. మోదీ 28ఏళ్ల క్రితం చనిపోయిన రాజీవ్ గురించి మాట్లాడుతున్నారు. సైన్యం త్యాగాల ద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారు. ఆయనేమీ చేయలేదు కాబట్టే ప్రజలకేమీ చెప్పలేని స్థితిలో మోదీ ఉన్నారు. మోదీ మాటల్లో ఓటమి నైరాశ్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది అని చంద్రబాబు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *