కావలి సబ్ కలెక్టర్ గారూ … చర్యలు తీసుకోండి!

VARTHA VIHARI NEWS:కావలి లో ” మహర్షి ” సినిమా ప్రదర్శిస్తున్న సినిమాహాళ్ల యజమానులు అక్రమమార్గానికి తెరలేపి ప్రజల జేబులు కొడుతుంటే – చర్యలు గైకొనాల్సిన అధికారులు ప్రేక్షక పాత్ర పోషిస్తుండడం దారుణ మనే చెప్పుకోవాలి . కావలిలో మహర్షి సినిమా రేట్లు వింటుంటే కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి . ఇదేమి దారుణమని యజమానుల్ని నిలదీసే దమ్ము సంబంధిత అధికారులకు లేకపోవడంతో – యజమానులు ఇష్టారాజ్యంగా ఎక్కడా లేని రేట్లు మహర్షి సినిమాకు పెట్టి ప్రజల జేబులు కొడుతున్నారు . మల్టీ ఫ్లెక్స్ థియేటర్లలో సిటీల్లో ఉండాల్సిన రేట్లు కావలిలో పెట్టి ప్రజల్ని బహిరంగంగా నిలువుదోపిడీ చేస్తుంటే అడిగే అధికారి కావలిలో లేడంటే నిజంగా సిగ్గు పడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది . నెల్లూరు నగరంలో మహర్షి ఆడే థియేటర్లలో మొదటి తరగతి టిక్కెట్టు గరిష్టంగా 150 రూపాయలకు విక్రయిస్తుంటే – కావలిలో 200 రూపాయలకు థియేటర్ యజమానులు విక్రయిస్తున్నారంటే అందుకు అధికారుల అసమర్థతే కారణంగా కనిపిస్తుంది . మానస కాంప్లెక్ లో ఒక్క థియేటర్ లొనే మాహర్షి సినిమా ప్రదర్శనకు అనుమతి ఉండగా – కాంప్లెక్స్ లోని రెండు థియేటర్లలో అక్రమంగా మహర్షి సినిమా ప్రదర్శిస్తూ 200 రూపాయలకు టిక్కెట్లు అమ్ముతూ అక్రమమార్గంలో ప్రజల్ని దోచుకొంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు థియేటర్ యజమానులతో కుమ్మక్కై లంచాలకు లొంగి ఇలా ప్రజల్ని దోపిడీ చేసుకోమని లైసెన్సులు ఇచ్చారా ? అన్న అనుమానాలు కలుగుతున్నాయి .

తక్షణం కావలి సబ్ కలెక్టర్ రంగప్రవేశం చేసి – థియేటర్ యజమానులు ప్రజల్ని , ప్రభుత్వాన్ని మోసం చేస్తూ సాగిస్తున్న బహిరంగ దోపిడీని అడ్డుకోవాలని ప్రజలు కోరుతున్నారు . సబ్ కలెక్టర్ గా , కావలి డివిజనల్ సుప్రీమ్ గా సీహెచ్ శ్రీధర్ IAS తగుచర్యలు గైకొనాలని , థియేటర్ యజమానుల దోపిడీకి అడ్డుకట్ట వేయాలని కూడా ప్రజలు ఆకాంక్షిస్తున్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *