అందుకే ఈవీఎంలపై నిందలు: చంద్రబాబుపై మోదీ

VARTHA VIHARI NEWS:ఈవీఎంల పనితీరుపై ఏపీ సీఎం చంద్రబాబు వ్యక్తం చేసిన అనుమానాలపై ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా స్పందించారు. ఏపీ సీఎం చంద్రబాబు రాజకీయ పర్యటనలపై కూడా ఆయన నోరు మెదిపారు. తొలి మూడు దశల పోలింగ్ సమయంలో తనను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని, ఇప్పుడు గాలి ఎటు వీస్తుందో తెలిసి ఈవీఎంలపై నిందలేస్తున్నారని మోదీ విమర్శించారు. క్రికెట్‌లో కొన్నిసార్లు ఔటయిన బ్యాట్స్‌మెన్ అంపైర్‌ను తప్పుబట్టినట్టు, ఇప్పుడు ఎన్నికల సంఘాన్ని తప్పుబడుతున్నారని మోదీ కౌంటర్ వ్యాఖ్యలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!