కేవీపీకి దేవినేని ఉమ కౌంటర్‌

VARTHA VIHARI NEWS:బీజేపీ-వైసీపీకి కోవర్టుగా పని చేస్తూ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు తమపై విషం చిమ్ముతున్నారని మంత్రి దేవినేని ఉమమహేశ్వరరావు అన్నారు. ఇవాళ అమరావతిలో ఆయన మాట్లాడుతూ గత ఐదేళ్లలో కేవీపీ ఎప్పుడైనా పోలవరం సందర్శించారా..? అని ప్రశ్నించారు. జలయజ్ఞాన్ని ధనయజ్ఞoగా మార్చి డబ్బులు దండుకున్నది కేవీపీ అని అందరికీ తెలుసని అన్నారు. దేశంలో ఉన్న 16 జాతీయ ప్రాజెక్టుల్లో 70 శాతం పూర్తయిన ప్రాజెక్టులు ఏమీ లేవని గుర్తు చేసిన ఉమ.. వచ్చే జనవరిలోగా తీహార్ జైలుకెళ్లే వాళ్ళు కూడా పోలవరం గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.పోలవరం ప్రాజెక్టు ఎంత పూర్తి అయిందో.. మిగతా జాతీయ ప్రాజెక్టులు ఏ మేరకు పూర్తయ్యాయో కేవీపీకి తెలియదా..? అని ప్రశ్నించారాయన. ఏపీ-తెలంగాణ ప్రజల ఒకరి కళ్లలో ఒకరు చూసుకోవడం లేదని ప్రధాని మోడీ అంటున్నారని.. కానీ తెలుగు రాష్ట్రాల ప్రజలంతా ఒక్కటేనని చెప్పారు. కేసీఆర్ – మోడీ మైత్రి వల్లే ఏపీ ప్రజలకు అన్యాయం జరుగుతోందన్నారు. ‘ఇప్పుడు కేసీఆర్ పోలవరం మీద సుప్రీంకోర్టులో కేసులు వేశారు. గ్రీన్ ట్రిబ్యునల్లో కవిత కేసు వేశారు’ అని గుర్తుచేశారు ఉమ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!