అమ్మ‌గా ర‌మ్య‌కృష్ణ‌…అత్త‌గా విజ‌య‌శాంతి

VARTHA VIHARI NEWS:సూప‌ర్‌స్టార్ మ‌హేష్ 25వ చిత్రం `మ‌హ‌ర్షి` ఈ నెల 9న విడుద‌ల‌ కానున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా త‌ర్వాత మ‌హేష్ చేయ‌బోయే సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. మ‌హేష్ హీరోగా న‌టిస్తున్న 26వ చిత్ర‌మిది. ఈ ఏడాది `ఎఫ్ 2`తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన ద‌ర్శ‌కుడు అనీల్ రావిపూడి ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నాడు. ఈ సినిమాలో సీనియ‌ర్ హీరోయిన్స్ విజ‌య శాంతి, ర‌మ్య‌కృష్ణ‌లు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నార‌ని వార్త‌లు వినిపించిన సంగ‌తి విదితమే.అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం మ‌హేష్‌కు ర‌మ్య‌కృష్ణ అమ్మ పాత్ర‌లో, విజ‌య‌శాంతి అత్త పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారట‌. పాత్ర‌ల ప‌రిధి, ప్రాముఖ్య‌త‌ను అనుస‌రించి ఈ సీనియ‌ర్ హీరోయిన్స్‌ను ఆ పాత్ర‌ల‌కు ఎంచుకున్నార‌ని టాక్‌. ఈ చిత్రానికి `స‌రిలేరు నీకెవ్వ‌రూ` అనే టైటిల్ పరిశీల‌న‌లో ఉన్న‌ట్లు స‌మాచారం. ఇందులో జ‌గ‌ప‌తిబాబు విల‌న్‌గా క‌నిపిస్తార‌ట‌. జూన్ నుండి ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ల‌నుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *