80 పోలింగ్‌ శాతం…..!

VARTHA VIHARI NEWS:ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్‌ శాతం గతంతో పోల్చితే గణనీయంగా పెరిగే అవకాశం ఉందని ఎన్నికల సంఘం అంచనా వేసింది. 2014 ఎన్నికల్లో 77.96 శాతం పోలింగ్‌ జరగ్గా, ఈసారి అది 80 శాతం వరకూ ఉంటుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది చెప్పారు. సాయంత్రం 6 గంటల వరకు చూస్తే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలిపి 74 శాతం నమోదైందని ఆయన ప్రకటించారు. సాయంత్రం 6 గంటల సమయానికి శ్రీకాకుళంలో 74.18 శాతం, విశాఖపట్టణంలో 76.4 శాతం, తూర్పుగోదావరిలో 74.28, పశ్చిమగోదావరిలో 70.59, కృష్ణాలో 71.18, గుంటూరులో 72.7, ప్రకాశంలో 73.52, నెల్లూరులో 68.25, కడపలో 71.3, కర్నూలులో 68 శాతం, అనంతపురంలో 71.63, చిత్తూరులో 72.4 శాతం పోలింగ్‌ నమోదైందని ఆయన వివరించారు. రాత్రి 9 గంటల వరకు 726 కేంద్రాల్లో పోలింగ్‌ సాగగా… మరికొన్ని కేంద్రాల్లో అర్థరాత్రి దాటే వరకూ ఓటింగ్‌ కొనసాగింది. దీంతో స్పష్టంగా ఎంత శాతం పోలింగ్‌ అయ్యిందనే వివరాలను ఈసీ ప్రకటించలేకపోయింది. గత ఎన్నికల కంటే కనీసం నాలుగు నుంచి ఐదు శాతం ఓటింగ్‌ పెరిగే అవకాశం కనిపిస్తోంది. పోలింగ్‌ శాతం 80కి చేరితే… రాష్ట్రంలో ఇదే తొలిసారి. 1955 నుంచి 2014 వరకూ ఒక్కసారి కూడా పోలింగ్‌ 80 శాతానికి చేరలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!