మార్పు కోసం ఓటు వేస్తానంటున్న క్రికెటర్‌

VARTHA VIHARI NEWS:ఏపీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమవనుంది. లోక్‌సభతోపాటు రాష్ట్ర అసెంబ్లీకి కూడా రేపు పోలింగ్‌ జరగనుంది. సామాన్య ప్రజలతోపాటు సెలబ్రిటీలు కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. టీమిండియా మాజీ ఆటగాడు, రాష్ట్రానికి చెందిన ప్రముఖ క్రికెటర్‌ వేణుగోపాలరావు తొలిసారిగా గాజువాకలో ఓటు వేయబోతున్నాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్‌ ద్వారా ప్రకటించాడు.

‘మొదటిసారి గాజువాకలో ఓటు వేయబోతున్నాను. మార్పు కోసం. తెలుగు రాష్ట్రాల భవిష్యత్తు కోసం. ఎవరికో మీ అందరికీ తెలుసు..’ అని పోస్ట్‌ పెట్టాడు. టీమిండియా తరఫున 16 వన్డేలాడిన వేణు.. ఇటీవలే జనసేనలో చేరాడు. వేణగోపాలరావు స్వస్థలం విశాఖపట్నం జిల్లాలోని గాజువక. ఇక్కడి నుంచే జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పోటీ చేస్తున్నారు. పార్టీ తరఫున విశాఖపట్నం జిల్లాలో ప్రచారం కూడా చేశాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *