పిసిసి రాష్ట్ర కార్యదర్శి నాగరాజు వైసీపీలో చేరిక……

VARTHA VIHARI NEWS: పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి నాగరాజు పదవ డివిజన్ లోని తన అనుచరులు 250 మంది తో కలిసి గురువారం వైసీపీలో చేరారు.నెల్లూరు లోక్సభ వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్రెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగరాజు చేరిక సంతోషమని తద్వారా పార్టీకి బలం చేకూరుతుందని ఆనందాన్ని వ్యక్తం చేశారు.ఎక్కడికి వెళ్ళినా వైసీపీలో చేరికలు పెరిగాయని అందరు జగన్ సీఎం కావాలని కోరుకుంటున్నారని చెప్పారు.దీన్నిబట్టి నెల్లూరు జిల్లాలో 2లోక్సభ 10 అసెంబ్లీ సీట్లు వైసీపీ లభిస్తాయని తెలిపారు.ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ ఆదాల ప్రభాకర్రెడ్డి నాయకత్వంలో పార్టీలో చేరి పార్టీకి బలం చేకూర్చాలని భావిస్తున్నట్లు తెలిపారు.జగన్మోహన్ రెడ్డి గెలుపునకు కృషి చేస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు.ఈ కార్యక్రమంలో ఏసు నాయుడు పాముల హరి శాలిని నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!