మోదీని గెలవనిచ్చేది లేదు: చంద్రబాబు

VARTHA VIHARI NEWS:ఏపీకి ద్రోహం చేసిన మోదీని గెలవనిచ్చేది లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో చంద్రబాబు ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘మేం మీకు బానిసలం కాదు… మా హక్కుల కోసం పోరాడతాం. తెలంగాణ కేసీఆర్‌ ఏనాడూ ఏపీ ప్రజల శ్రేయస్సును కోరుకోలేదు. పోలవరంపై కేసీఆర్‌ సుప్రీంకోర్టుకు వెళ్లాడు. పోలవరాన్ని అడ్డుకునేందుకు కేసీఆర్‌ ఎవరు? భద్రాచలం మునిగిపోతుందని పోలవరాన్ని అడ్డుకుంటున్నారు. భద్రాచలం కూడా మాదే… భద్రాచలాన్ని మేమే తీసుకుంటాం. రాష్ట్రాభివృద్ధి కోసం నేను యజ్ఞం చేస్తున్నాను. రాక్షసుల మాదిరిగా నా యజ్ఞాన్ని నాశనం చేస్తున్నారు’’ అని చంద్రబాబు ధ్వజమెత్తారు.వెలుగొండ ప్రాజెక్టును పూర్తిచేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. నదుల అనుసంధానంతో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తున్నామని, ఓ నిర్ణయం తీసుకుంటే బుల్లెట్‌లా ముందుకెళ్తామన్నారు. పట్టిసీమను పూర్తిచేసి… కృష్ణా డెల్టాకు నీరిచ్చామని, కుప్పం కంటే ముందే పులివెందులకు నీరిచ్చామని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తుచేశారు. గోదావరి-పెన్నా నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టామన్నారు. సోమశిలకు గోదావరి నీటిని తీసుకెళ్తామని, నాగార్జునసాగర్‌ కాల్వలకు గోదావరి నీటిని తీసుకెళ్తామని బాబు పేర్కొన్నారు. రాష్ట్రంలోని 140 నదులను అనుసంధానం చేస్తామని, వెలుగొండ ద్వారా గిద్దలూరుకు నీరందిస్తామని ఆయన భరోసా ఇచ్చారు.‘‘ఐదేళ్లలో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఏపీ ప్రజలంతా ఆనందంగా ఉన్నారు. వృద్ధుల పెన్షన్లను రూ.2వేలకు పెంచాం. ఆడబిడ్డల సంక్షేమానికి రాత్రింబవళ్లు పనిచేస్తాను. రాష్ట్రంలో నాకు కోటిమంది చెల్లెమ్మలు ఉన్నారు. ఆడబిడ్డల సౌభాగ్యం కోసం పసుపు-కుంకుమ ఇచ్చాం. పండుగలకు రెండు గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. మహిళలందరికీ స్మార్ట్‌ఫోన్లు అందజేస్తా’’మని చంద్రబాబు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!