నేడు రెండు జిల్లాల్లో చంద్రబాబు పర్యటన

VARTHA VIHARI NEWS: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నేడు రెండు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఎన్నికలకు సమయం దగ్గరపడడంతో ఆయన స్పీడు పెంచేశారు. ఇందులో భాగంగానే రోజుకు రెండు, మూడు జిల్లాల్లో పర్యటనలు జరుపుతున్నారు. తమ పార్టీ నుంచి పోటీ చేయబోయే అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహిస్తున్నారు. నేడు (గురువారం) ఆయన గుంటూరు, ప్రకాశం జిల్లాలో పర్యటించి, ప్రచారం చేయనున్నారు. ఇందులో భాగంగా మధ్యాహ్నం 1.45 గంటలకు ప్రకాశం జిల్లా గిద్దలూరులో, 3.30 గంటలకు మార్కాపురంలో, సాయంత్రం 5 గంటలకు అద్దంకిలో రోడ్‌ షోలు నిర్వహించనున్నారు. అలాగే 6.30 గంటలకు గుంటూరు జిల్లా బాపట్లలో, రాత్రి 8.30 గంటలకు ప్రత్తిపాడులో ఆయన ఎన్నికల ప్రచారం చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!