మూడోసారీ దుమ్మురేపిన టీమిండియా

VARTHA VIHARI NEWS: టీమిండియా మరోమారు సత్తా చాటింది. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన కోహ్లీ సేన ఐసీసీ తాజా టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచింది. నేడు విడుదల చేసిన ఈ ర్యాంకింగ్స్‌లో భారత జట్టు 116 పాయింట్లతో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. టీమిండియా అగ్రస్థానాన్ని అందుకోవడం వరుసగా ఇది మూడోసారి. టెస్టు ర్యాక్సింగ్స్‌లో ‘హ్యాట్రిక్’ సాధించిన టీమిండియా మిలియన్ డాలర్ల ప్రైజ్‌మనీని సొంతం చేసుకుంది. 108 పాయింట్లతో న్యూజిలాండ్ ఆ తర్వాత స్థానంలో నిలిచింది. 105 పాయింట్లతో దక్షిణాఫ్రికా మూడో స్థానంలో నిలవగా, 104 పాయింట్లతో ఆస్ట్రేలియా నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది.టీమిండియా వరుసగా మూడోసారీ టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలవడంపై కెప్టెన్ విరాట్ కోహ్లీ సంతోషం వ్యక్తం చేశాడు. ఎంతో గర్వంగా ఉందని, అన్ని ఫార్మాట్లలోనూ జట్టు అద్భుతంగా రాణిస్తోందని అన్నాడు. ఎంతో బాగా ఆడితే తప్ప టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలవడం కష్టమన్న కోహ్లీ.. టెస్టు ప్రాముఖ్యత తనకు తెలుసన్నాడు. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో కివీస్ రెండో స్థానంలో నిలవగా, ఆ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ 2018 సంవత్సరానికి గాను ‘ఐసీసీ స్పిరిట్ ఆఫ్ క్రికెట్’ అవార్డు దక్కించుకున్నాడు. రెండో స్థానంలో నిలిచిన న్యూజిలాండ్ జట్టు 5 లక్షల డాలర్లు, మూడో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా 2 లక్షల డాలర్ల ప్రైజ్ మనీని సొంతం చేసుకున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *