రంగంలోకి విజయమ్మ, షర్మిల..

VARTHA VIHARI  V NEWS:సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ కాంగ్రెస్ పార్టీ తరపున ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తుండగా… ఇప్పుడు ఆయనకు తోడుగా కుటుంబ సభ్యులు కూడా రంగంలోకి దిగుతున్నారు. ఇవాళ్టి నుంచి వైసీపీ అధినేత తల్లి వైఎస్‌ విజయమ్మ, ఆయన సోదరి షర్మిల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్న విజయమ్మ… కనిగిరి, మార్కాపురం నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారు. మార్చి 30వ తేదీ ప్రకాశం జిల్లాలోని ఎర్రగొండపాలెం, గుంటూరు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గాల్లో.. మార్చి 31న శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం, పలాస, పాతపట్నం నియోజకవర్గాల్లో ఇలా మొత్తం 40 నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తారు విజయమ్మ. ఇక షర్మిల కూడా ప్రచార ఇవాళే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. మంగళగిరి నుంచి ఇచ్చాపురం వరకు దాదాపు 10 జిల్లాల్లో వైసీపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేయనున్నారు. ఇవాళ గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం నుంచి ఆమె తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారు. మంగళగిరి నియోజకవర్గంలోనే విస్తృతంగా ప్రచారం చేసి, 31వ తేదీ శనివారం గుంటూరు వెస్ట్‌, గుంటూరు ఈస్ట్‌, తాడికొండ, పెదకూరపాడు, నరసరావుపేట నియోజకవర్గాల పరిధిలోనూ ఎన్నికల ప్రచారం చేయనున్నారు. దాదాపు 50 నియోజకవర్గాల్లో షర్మిల ప్రచారంలో పాల్గొనే విధంగా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు వైసీపీ నేతలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!