ఐపీఎల్: ధోనీ కాళ్లను తాకిన అభిమానులు

VARTHA VIHARI NEWS:టీమిండియా మాజీ కెప్టెన్‌, ఐపీఎల్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్‌ ధోనీకి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా భారత్ లో అయితే పిచ్చి పీక్ లో ఉంది. ధోనీ ఆరంగేట్రం నుంచి ఇప్పటివరకు తన బ్యాటింగ్, కీపింగ్ లతో అభిమానులను అలరిస్తున్నాడు. మరోవైపు కూల్ కెప్టెన్ గా టీమిండియాకు ఎన్నో విజయాలు అందించి అభిమానుల గుండెల్లో నిలిచాడు.ధోనీపై అభిమానులకు పిచ్చి పీక్ లో ఉండడంతో.. అభిమానులు అతన్ని కలవాలని చూస్తుంటారు. ఇంకా కొందరు అభిమానులు అయితే ఓ అడుగు ముందుకేసి సెక్యూరిటీని తప్పించుకుని ధోనీ కాళ్లను తాకి సంబరపడిపోతుంటారు. తాజాగా ఇలాంటి ఘటనే చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో చోటుచేసుకుంది.

ఛేదనలో చివరి వరకు క్రీజ్ లో ఉండి చెన్నై జట్టుకు ధోనీ విజయాన్ని అందించాడు. చివరి ఓవర్లో బ్రేవో ఫోర్ బాది మ్యాచ్ ను ముగించడంతో.. ధోనీ, బ్రేవోలు సహచర ఆటగాళ్లకు షేక్‌ హ్యాండ్‌ ఇస్తున్నారు. ఇంతలో ఇద్దరు ధోనీ అభిమానులు సెక్యూరిటీని తప్పించుకుని వచ్చి ధోనీ కాళ్లు మొక్కారు. ఒకరు ధోనీ కాళ్లను తాకగా.. మరొకరు తన చేతులతో ధోనీ కాళ్లను చుట్టేశాడు. అనంతరం ధోనీ తన అభిమానులకి షేక్‌ హ్యాండ్‌ ఇచ్చాడు. ఇంతలో సెక్యూరిటీ వచ్చి వారిని మైదానం బయటకు తీసుకెళ్లారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. అయితే అభిమానులు ధోనీ కాళ్లు మొక్కడం 17వ సారి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!