రాష్ట్రంలో త్వరలో హంగ్ అసెంబ్లీ చింతా మోహన్…..

VARTHA VIHARI NEWS:ఏప్రిల్ 11 జరుగు ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని తిరుపతి కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి చింతా మోహన్ జోస్యం చెప్పారు. శుక్రవారం పార్లమెంటు స్థానానికి నామినేషన్ దాఖలు చేయడానికి నెల్లూరు కి వచ్చిన చింతామోహన్ స్థానిక ఇందిరా భవన్లో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ విధంగా అయితే హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందో దేశంలో కూడా హంగ్ పార్లమెంట్ ఏర్పడుతుందని చింతా మోహన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఏర్పడే ప్రభుత్వం ఉభయగోదావరి జిల్లాలలో ఏ పార్టీ అయితే అధిక శాతం సీట్లు సంపాదిస్తుంది ఆ పార్టీయే ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చింతా మోహన్ అన్నారు. రాష్ట్రంలో జనసేన పార్టీ దూసుకుపోతుందని చింతా మోహన్ తెలిపారు. రాజకీయాల్లో నైతిక విలువలు పూర్తిగా పడిపోయాయని చింతా మోహన్ అన్నారు. అలాగే శనివారం నుండి దుగరాజపట్నం నుండి తను ప్రచారం ప్రారంభిస్తున్నారని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!