అభివృద్ధిని చూసి ఓటు వేయండి అబ్దుల్ అజీజ్…

VARTHA VIHARI NEWS:నగరాభివృద్ధి ని చూసి ఓటు వేయమని నెల్లూరు గ్రామీణ నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి అబ్దుల్ అజీజ్ అన్నారు. గురువారం ప్రచారం ప్రారంభించిన అజీస్ ముందుగా నగర శివారులోని 17 వ డివిజన్ గుల్లపాలెం లో ఆయన ప్రచారం నిర్వహించారు. గడపగడపకు వెళ్లి ఐదు సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి పనులను చూసి తమకు ఓటు వేయాలని కోరారు. అనంతరం అజీజ్ మాట్లాడుతూ ప్రతి ఇంటికి ఓటు అడిగే దానికి వెళ్ళినప్పుడు ఆ ఇంటిలోని సభ్యుల ముఖములో ఆనందం కనిపిస్తుందని ఆ ఆనందము తోనే తెలుగుదేశానికి ఓటు వేస్తారు అనే నమ్మకంతో మేము ముందుకు పోతున్నామని అది తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *