ఉద‌య‌గిరిలో వైసిపి బూత్ లెవ‌ల్ క‌మిటి స‌మావేశం

V NEWS – నెల్లూరు జిల్లా ఉద‌యగిరి మండ‌లంలోని కొండామ‌య‌పాలెం పంచాయితీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బూత్ లెవ‌ల్ స‌మావేశం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా మాజీ సర్పంచ్ ఓబుల్ రెడ్డి ప్ర‌జ‌ల‌ను పంచాయితీలోని స‌మ‌స్య‌లు అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ గ్రామంలోని స‌మ‌స్య‌లు తీరాల‌న్నా, మంచినీటి స‌మ‌స్య‌కు శాశ్విత ప‌రిష్కారం ల‌భించాల‌న్నా అది ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్య‌మ‌ని తెలిపారు. ప్ర‌తి ఒక్క‌రూ ఈ ఎన్నిక‌ల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాల‌ని కోరారు. ఈ కార్య‌క్ర‌మంలో పార్టీ స‌మ‌న్వ‌య‌క‌ర్త శ్రీ‌నివాసుల‌రెడ్డి, పంచాయితీ నాయ‌కులు త‌దిత‌రులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *