ప‌టిష్ట‌మ‌వుతున్న‌ ఆదాల సైన్యం – వేమిరెడ్డి హంస‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో చేరిక‌లు

V NEWS – నెల్లూరు రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా బ‌రిలోకిదిగిన మాజీ మంత్రి, ఆదాల ప్ర‌భాక‌ర్ రెడ్డి, త‌న‌దైన రాజ‌కీయ చాతుర్య‌త‌ను ప్ర‌ద‌ర్శ‌స్తున్నారు. చాప‌కింద నీరులా రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో దూసుకుపోతున్నారు. నెల్లూరు రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంపై త‌న‌కున్న ప‌ట్టును మ‌రింత ప‌టిష్టం చేసుకుంటున్నారు. ఎన్నిక‌ల స‌మీపిస్తున్న కొద్దీ త‌న బ‌లాన్ని పెంచుకుంటూ తిరుగులేని నాయ‌కుడిగా ఎదుగుతున్నారు. త‌న అనుచ‌ర గ‌ణ‌మే బ‌లంగా, రాజ‌కీయ చతుర‌త ప్ర‌ద‌ర్శిస్తున్నారు. త‌న అనుచ‌ర‌ణ గ‌ణాన్నిచైత‌న్య ప‌రుస్తూ, రూర‌ల్ గ్రామాల‌పై ప‌ట్టు బిగిస్తున్నారు. అందులో భాగంగా త‌న‌కు అనుచ‌రుడిగా, స‌న్నిహితుడిగా ఉన్న వేమిరెడ్డి హంస‌కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో 350 మంది ఆదాల ప్ర‌భాక‌ర్ రెడ్డి స‌మ‌క్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వేమిరెడ్డి హంసుకుమార్ రెడ్డితో పాటూ ఆయ‌న కుమారులు వేమిరెడ్డి హ‌రికృష్ణారెడ్డి, వేమిరెడ్డి హ‌రి శివా రెడ్డిల స‌హ‌కారంతో నెల్లూరు రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో జ‌న స‌మీక‌ర‌ణ చేస్తూ, వారిని తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ చేప‌ట్టిన అభివృద్ధి సంక్షేమాన్ని తెలియ‌జేస్తూ, భ‌విష్య‌త్తులో రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో చేయ‌బోయే అభివృద్ధిని వివ‌రిస్తూ, త‌న కార్య‌క‌ర్త‌ల‌ను ప్ర‌జ‌లను త‌న‌వైపుకు తిప్పుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా నెల్లూరు రూర‌ల్ నియోజ‌వ‌క‌ర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్య‌ర్థి, మాజీ మంత్రి ఆదాల ప్ర‌భాక‌ర్ రెడ్డి మాట్లాడుతూ వేమిరెడ్డి హంసకుమార్ రెడ్డి, ఆయ‌న కుమారుల ఆధ్వ‌ర్యంలో 350 మంది తెలుగుదేశం పార్టీలో చేర‌డం చాలా సంతోష‌క‌ర‌మ‌ని అన్నారు. నెల్లూరు రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో టిడిపి బ‌ల‌మైన శ‌క్తిగా ఉంద‌ని, భ‌విష్య‌త్తులో రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గాన్ని అన్నీ విధాలుగా అభివృద్ధి చేసేందుకు క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని తెలిపారు. తాను చెప్పిన ప్ర‌తి మాట‌, ఇచ్చిన ప్ర‌తి హామిని నెర‌వేర్చ‌డ‌మే త‌న ల‌క్ష్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు. అదేవిధంగా టిడిపి నాయ‌కులు వేమిరెడ్డి హంసకుమార్ రెడ్డి మాట్లాడుతూ త‌న 65ఏళ్ల జీవిత కాలంలో ఆదాల ప్ర‌భాక‌ర్ రెడ్డి వంటి అభివృద్ధి ప్ర‌దాత‌ను చూడ‌లేద‌ని అన్నారు. ఎంతో సౌమ్యుడిగా, ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన మాటను నెర‌వేర్చేందుకు నిరంత‌రం శ్ర‌మించే నాయ‌కుడు ఆదాల ప్ర‌భాక‌ర్ రెడ్డి అని అన్నారు. ఆయ‌న మంచి మ‌న‌స్సుతోనే రూర‌ల్ నుంచి భారీగా టిడిపిలోకి వ‌ల‌స‌లు వ‌స్తున్నాయ‌ని తెలిపారు. ఈ వ‌ల‌స‌ల ప‌ర్వం ఇంకా కొన‌సాగుతుంద‌ని, అతి త్వ‌ర‌లోనే వివిధ పార్టీలకు చెందిన కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు, రూర‌ల్ నుంచి ఆదాల ప్ర‌భాక‌ర్ రెడ్డి స‌మ‌క్షంలో టిడిపి కండువాలు క‌ప్పుకోనున్నార‌ని తెలిపారు. ఆదాల ప్ర‌భాక‌ర్ రెడ్డి గెలుపు కోసం తామంతా ఐక్యంగా శ‌క్తివంచ‌న లేకుండా కృషి చేస్తామ‌ని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *