జ‌గ‌న్నాథుడి స‌న్నిధిలో ఎంపి వేమిరెడ్డి

V NEWS – అంతర్జాతీయ శ్రీ కృష్ణ చైతన్య సంఘము ఆధ్వర్యములో నగరములో నిర్వహించిన 8 వ జగన్నాథ్ రథయాత్ర శోభాయమానముగా జరిగినది. ఈ సందర్భముగా ఎం.పి వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డి జ‌గ‌న్నాథుడి ర‌థ‌యాత్ర‌లో పాల్గొని ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ ప్రపంచంలో 650 చోట్ల ఈ జగన్నాథ రథయాత్రలు జరుగుతాయి. ప్రత్యక్ష దైవ దేవుడు శ్రీ కృష్ణ భగవానుడు పూరి క్షేత్రములో శ్రీ పూరి జగన్నాధుడుగా వెలవటము జరిగినది. పూరీలో రథయాత్ర ఎంత బాగా జరుగుతుందో అదేవిధంగా ఇస్కాన్ వారు ఆ పూరి క్షేత్ర వైభవాన్ని మనకు కనుల విందుగా చూపించడం చాలా సంతోషము. జిల్లా ప్రజలకు జగన్నాధుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. పూరి క్షేత్రములో ప్రతి సంవత్సరం జూలైలో జరుగుతుంది. మిగతా చోట్ల అక్కడ అనుకూలతను బట్టి రథయాత్ర చేపడతారు. ఇక్కడ ఆ జగన్నాథ స్వామి రథచక్రాలను లాగే బాగ్యాన్ని కల్పించిన ఇస్కాన్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తదుపరి ఎం.పి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రథయాత్ర ను గుమ్మడికాయతో దిష్టి తీసి ప్రారంభించటము జరిగినది.ఈ రథయాత్ర నగరంలోని బార్ కాస్ ( కలెక్టర్ కార్యాలయము నుండి) సెంటర్ నుంచి ఇస్కాన్ మందిరము వరకు కొనసాగినది. ఈ కార్యక్రమంలో ఇస్కాన్ సౌత్ ఇండియా ప్రెసిడెంట్ శ్రీ భాను స్వామి, పేరంబుర్ ప్రెసిడెంట్ జై గోపి స్వామి , నెల్లూరు ప్రెసిడెంట్ సుఖదేవ్ స్వామి మరియు వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *