విద్య‌తోనే పేద‌రిక నిర్మూల‌న – ఎమ్మెల్యే పోలంరెడ్డి

VARTHA VIHARI NEWS:కోవూరు నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని విడ‌వ‌లూరు, ప‌డుగు పాడు గ్రామాల్లో 6వ విడ‌త జ‌న్మ‌భూమి మా ఊరు కార్య‌క్ర‌మం జ‌రిగింది.ఈ కార్య‌క్ర‌మానికి ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీ‌నివాసుల‌రెడ్డి ముఖ్యతిథిగా విచ్చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ పేద‌రికం నిర్మూల‌న జ‌ర‌గాలంటే విద్య‌తోనే సాధ్య‌మ‌ని అన్నారు. అందుకోస‌మే తెలుగుదేశం ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో పేద విద్యార్థులకు నాణ్య‌మైన విద్య‌ను అందించేందుకు నూత‌న త‌ర‌గ‌తి గ‌దులు, డిజిట‌ల్ చ‌దువులు, కంప్యూట‌ర్లు అందించ‌డంతోపాటూ, మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థకాన్ని పేద విద్యార్థుల‌కు అందిస్తున్న‌ట్లు తెలిపారు. అంతేకాకుండా, పేద వైద్యం కోసం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తున్నార‌ని అన్నారు. కోవూరులో రోడ్డుని ఆధునీక‌రించేందుకు 3 కోట్ల రూపాయ‌ల నిధుల‌ను మంజూరు చేశామ‌ని, త్వ‌రలోనే ప‌నులు ప్రారంభిస్తామ‌ని అన్నారు. గ‌తంలో ఎన్న‌డూ చేయ‌ని అభివృద్ధిని, విడ‌వ‌లూరు, ప‌డుగుపాడు గ్రామాల్లో చేశామ‌ని, అన్నారు. అనంత‌రం స్థానికంగా ఏర్పాటు చేసిన ఉచిత మెడిక‌ల్ క్యాంపును ప‌రిశీలించిన ఎమ్మెల్యే, పేద‌లు ఈ వైద్య శిబిరాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని కోరారు. ఈ కార్య‌క్ర‌మంలో ప‌లువురు అధికారులు, టిడిపి నాయ‌కులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *