‘ఇప్పుడు గజగజ వణికిపోతున్నారు..’

VARTHA VIHARI NEWS:వైఎస్ జగన్ పై హత్య యత్నం కేసులో ఇప్పుడు కొందరు గజగజ వణికిపోతున్నారని సెటైర్లు వేశారు వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా… జగన్‌పై జరిగిన హత్యాయత్నం కేసును ఎన్‌ఐఏకు అప్పగించడంపై స్పందించిన ఆమె… కేసు ఎన్‌ఐఏకు ఇవ్వడానికి చంద్రబాబు, లోకేష్ ఎందుకు భయపడ్డారని ప్రశ్నించారు. 13 జిల్లాలకి రాజ్యాంగం వర్తించదు అన్నట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డ ఆమె… ఏపీ ప్రభుత్వం ఆర్ధిక నెరగాళ్లకు అడ్డాగా మార్చారని ఆరోపించారు. నియంత హిట్లర్‌లా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు.. ఎవరు ఆయన్ని ప్రశ్నించవద్దా? కేంద్ర పరిధిలో ఉన్న ఎయిర్‌పోర్ట్‌లో జగన్‌ను హత్య చేస్తే కేంద్రంపై నెట్టవచ్చని కుట్రపన్నారని విమర్శించారు. ఇప్పుడు నిప్పు నాయుడు, పప్పు నాయుడు ఎందుకు భయపడుతున్నారని చంద్రబాబు, లోకేష్‌పై సెటైర్లు వేసిన రోజా… సినిమాలు లేని శివాజీతో కథ చెప్పించారు.. శివాజీని ఇప్పటికీ ఎందుకు విచారించలేదని ప్రశ్నించారు.

ఎన్‌ఐఏ విచారణ ఎందుకు అంటున్న చంద్రబాబు… కేంద్ర ప్రభుత్వ రక్షణ ఎందుకు వినియోస్తున్నారు. రాష్ట్ర పోలీసుల మీద నమ్మకం లేదా? అని ప్రశ్నించారు. హర్షవర్ధన్, శివాజీ లాంటి వాళ్లను బయటకి లాగాలి… కుట్ర దారులను శిక్షించాలని డిమాండ్ చేసిన రోజా… చంద్రబాబుకు నిద్రలో కూడా జగన్ కనిపిస్తున్నారని… ఎన్‌ఐఏ విచారణలో చంద్రబాబు, లోకేష్, హర్షవర్ధన్, శివాజీ పేర్లు బయటకు రావడం ఖాయమని వ్యాఖ్యానించారు. ఎన్‌ఐఏ విచారిస్తుంటే చంద్రబాబు మనుషులు ఉలిక్కి పడుతున్నారని ఎద్దేవా చేసిన రోజా… పరిటాల రవి, మాధవ రెడ్డి హత్య కేసు వెనక చంద్రబాబే ఉన్నారు… ఇది టీటీడీ వాళ్లకు తెలుసని ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *