చివ‌రి ఆయ‌క‌ట్టు వ‌ర‌కు నీరివ్వ‌కుంటే – సాగునీరు అడ్డుకుంటాం – మేక‌పాటి గౌతంరెడ్డి

VARTHA VIHARI NEWS:సాగునీటీ కోసం నెల్లూరు జిల్లా ప‌రిష‌త్ స‌ర్వ‌స‌భ్య స‌మావేశం నేప‌థ్యంలో ఆత్మ‌కూరు ఎమ్మెల్యే మేక‌పాటి గౌతంరెడ్డి జ‌డ్‌.పి కార్యాల‌యం ఎదుట రైతుల‌తో క‌ల‌సి భారీ ధ‌ర్నా నిర్వ‌హించారు. చివ‌రి ఆక‌ట్టు వ‌ర‌కు సాగునీరు అందించాల‌ని నినాదాలు చేస్తూ, జ‌డ్‌పి కార్యాల‌యం ముందు రైతుల‌తో బైటాయించి ఆందోళ‌న చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా ఆత్మ‌కూరు ఎమ్మెల్యే మేక‌పాటి గౌతంరెడ్డి మాట్లాడుతూ సోమ‌శిల ప్రాజెక్టు ఆత్మ‌కూరు నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్నా, రైతుల‌కు చివ‌రి ఆయ‌క‌ట్టు వ‌ర‌కు సాగు నీరు అందించ‌క‌పోవ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని తెలిపారు. సోమ‌శిల ఉత్త‌ర ద‌క్షిణ కాలువ‌ల ద్వారా చివ‌రి ఆయ‌క‌ట్టువ‌ర‌కు సాగు నీరు అందించాల‌ని, ఇందుకోసం ఎంత‌దూర‌మైనా పోరాటం చేస్తాన‌ని ఎమ్మెల్యే గౌతంరెడ్డి తెలిపారు. రైతుల‌కు సాగునీరు అందించ‌డంలో, తెలుగుదేశం ప్ర‌భుత్వం పూర్తిగా విఫ‌ల‌మైంద‌ని, ఈ ప్ర‌భుత్వ తీరు వ‌ల్ల అన్న‌దాత‌లు రోడ్డుపైకి వ‌చ్చి ఆందోళ‌న చేయాల్సిన దుస్థితి ఏర్ప‌డింద‌ని మండిప‌డ్డారు. డెల్టా రైతులు, నాన్ డెల్టా రైతులు అని వేరు చేసి, టిడిపి స‌ర్కారు వ్య‌వ‌హరిస్తుండ‌టం బాధ‌క‌ర‌మ‌ని, దీనిని తాము స‌హించ‌బోమ‌న్నారు. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యూలేట‌రి ద్వారా వ‌చ్చిన నీటి విష‌యంలో జిల్లాలోని రైతులంద‌రికీ స‌మాన వాటా ఉంద‌ని, పెన్నాకు వ‌ర‌ద నీరు వ‌చ్చిన‌ప్పుడు మాత్ర‌మే డెల్టా రైతుల‌కు ప్రాధ‌న్య‌త ఉంటుంద‌ని, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యూలేట‌రి ద్వారా వ‌చ్చిన సాగునీటిని మెట్ట ప్రాంత రైతుల‌కు అందించాల‌ని డిమాండ్ చేశారు. సోమ‌శిల ఉత్త‌ర ద‌క్షిణ కాలువ‌ల ద్వారా చివ‌రి ఆయ‌క‌ట్టు వ‌ర‌కు సాగు నీరు అందించ‌క‌పోతే, దిగువ‌కు ఒక్క చుక్క నీరు కూడా వెళ్ల‌కుండా అడ్డుకుంటామ‌ని మేక‌పాటి గౌతం రెడ్డి హెచ్చ‌రించారు. మ‌రోవైపు మేక‌పాటి గౌతం రెడ్డి ఆధ్వ‌ర్యంలో జ‌డ్‌పి కార్యాల‌యం ఎదురుగా జ‌రిగిన ధ‌ర్నాతో స్పందించిన రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి, ఎమ్మెల్యే గౌతం రెడ్డితో మాట్లాడి, అంద‌రికీ సాగునీరు అందే విధంగా చ‌ర్య‌లు చేప‌డ‌తామ‌ని తెల‌ప‌డంతో ఆందోళ‌న విరమించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *