18వ తేదిన గురుకృప వారి కార్తీక నృత్య‌నీరాజనం

V NEWS – నెల్లూరులోని టౌన్ హాల్‌లో ఈ నెల 18వ తేది సాయంత్రం 6గంట‌ల‌కు గురుకృప క‌ళాక్షేత్రం ఆధ్వ‌ర్యంలో కార్తీక నృత్య నీరాజ‌నం కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తున్న‌ట్లు గురుకృప క‌ళాక్షేత్ర వ్య‌వ‌స్థాప‌కురాలు సుర‌భిగాయ‌త్రి శివ‌కుమారి తెలిపారు. ఈ కార్తీక నృత్య నీరాజ‌నంలో ఆ మ‌హాదేవుడికి నృత్య‌కుసుమాల‌తో 12 ర‌కాల తిల్లానాలు ప్ర‌ద‌ర్శించ‌డం జ‌రుగుతుంద‌ని చెప్పారు. ఈ నృత్య‌నీరాజ‌నానికి విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రులు, క‌ళాభిమానులు, పుర‌ప్ర‌ముఖులు విచ్చేసి జ‌య‌ప్ర‌దం చేయాల‌ని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *