శబరిమలపై జనవరి 22న ఓపెన్ కోర్టు

VARTHA VIHARI NEWS :  శబరిమలకు మహిళా భక్తులందరినీ అనుమతించిన తీర్పుపై దాఖలైన అన్ని పిటిషన్ల హియరింగ్ ను జనవరి 22న చేపడతామని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇందుకోసం దాఖలైన రివ్యూ పిటిషన్లతో పాటు పెండింగ్ లో ఉన్న ఇతర పిటిషన్లను కూడా పరిగణనలోకి తీసుకున్న చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్… ఓపెన్ కోర్టుకు అంగీకరించారు. అయితే ఆ పిటిషన్లలో ఓపెన్ కోర్టు కావాలని అడిగినవాటిని ఈరోజే విచారించాలంటూ ఇవాళ మరో పిటిషన్ దాఖలైంది. అయితే ఆ పిటిషన్ ను తిరస్కరించిన కోర్టు… అన్ని పిటిషన్లకూ కలిపే ఓపెన్ కోర్టు నిర్వహిస్తామన్నారు. అలాగే అక్టోబర్ 28న ఇచ్చిన తీర్పుపై స్టే గానీ, తాజా ఆదేశాలు గానీ ఏమీ లేవని పేర్కొన్నారు. ఇక ఈ కేసులో 49 రివ్యూ పిటిషన్లు, 4 రిట్ పిటిషన్లు దాఖలయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *