గుండె ఊపిరితిత్తుల మార్పిడికి నారాయ‌ణ హాస్పిట‌ల్ శ్రీ‌కారం

 

VARTHA VIHARI NEWS : నెల్లూరులోని నారాయ‌ణ హాస్పిట‌ల్‌లో విలేక‌ర్ల స‌మావేశం నిర్వ‌హించారు. ఈసంద‌ర్భంగా నారాయ‌ణ హాస్పిటల్స్ కో ఆర్డినేట‌ర్ డాక్ట‌ర్‌ విజ‌య‌కుమార్‌, మెడిక‌ల్ క‌ళాశాల ప్రిన్సిప‌ల్ నాగిరెడ్డి, చెన్నై గ్లోబ‌ల్ హాస్పిట‌ల్‌ డాక్ట‌ర్ భాస్క‌ర్‌రెడ్డి, డాక్ట‌ర్ బాల‌సుబ్ర‌మ‌ణ్యం, డాక్ట‌ర్ సందీప్ అక్వాల్‌లుమాట్లాడుతూ నెల్లూరు నారాయ‌ణ హాస్పిట‌ల్‌, క‌ళాశాల‌, చెన్నై గ్లోబ‌ల్ హాస్పిట‌ల్ సంయుక్తంగా యునికేర్ హెల్త్ సెంట‌ర్ ఆధ్వ‌ర్యంలో నారాయ‌ణ‌, చైన్నై గ్లోబ‌ల్ సంయుక్త ఆధ్వ‌ర్యంలో గుండె, ఊపిరితిత్తుల మార్పిడి శ‌స్త్ర‌చికిత్స‌లు నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. అతి త్వ‌ర‌లోనే నెల్లూరు నారాయ‌ణ మెడిక‌ల్ హాస్పిట‌ల్ క‌ళాశాల‌లో ఈ అవ‌య‌వ‌మార్పిడి శ‌స్త్ర‌చికిత్స‌లు ప్రారంభింస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు 135 అవ‌య‌వ మార్పిడి శ‌స్త్ర‌చికిత్స‌ల‌ను నిర్వ‌హించామ‌ని, అందులో 82శాతం విజ‌య‌వంతం అయ్యాయ‌ని స్ప‌ష్టం చేశారు. నెల్లూరు జిల్లా వైద్య‌చ‌రిత్ర‌లో ఇదో మైలురాయిగా నిలుస్తుంద‌ని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *