మధుమేహ వ్యాధితో బాధపడేవారికి శుభవార్త

VARTHA VIHARI NEWS : నెల్లూరు దర్గామిట్టలోని సుందరం ఫైనాన్స్ పక్కన ఉన్న “నేచర్స్ వ్యాలీ” అక్టోబర్ 7వ వార్షికోత్సవం సందర్భంగా మధుమేహ వ్యాధితో బాధపడేవారికి ఒక శుభవార్త తెలియజేయాలని విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసినట్లు నేచర్స్ వ్యాలీ అధినేత కోట సునీల్ కుమార్ అన్నారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కన్యాకుమారికి చెందిన “వైట్ లేక్ ఆర్గానిక్స్” కంపెనీ నుండి స్టేవియా అనే డయా టీ ని ఉత్పాదించడం జరిగిందని, దీనిని వాడటం ద్వారా మధుమేహం 30 రోజులలో నియంత్రించబడుతుందని తెలిపారు. ఒకవేళ అలా నియంత్రించబడకపోతే వినియోగదారుడు కొనుగోలు చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లించబడుతుందని కంపెనీ వారు తెలియజేశారని అన్నారు. వ్యాపార దృక్పథంతో కాకుండా సమాజంలో అధిక సంఖ్యలో ఉన్న మధుమేహ వ్యాధి గ్రస్తులకు ఆరోగ్యపరంగా మేలు చేయ్యాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని కోట సునీల్ కుమార్ అన్నారు. ఈ టీ పొడిని ప్రతి రోజు రెండు నుంచి మూడు గ్రాములు.. 150 మీ.లీ. నీటిలో 3 నుంచి 5 నిమిషాలు మరగించి, వడకట్టి సేవించినట్లైతే.. శరీరానికి కావలిసిన ఇన్సులిన్ వెంటనే ఉత్పత్తి అవుతుందని తెలిపారు. ఈ టీ ఆకులో జీరో క్యాలరీ ప్రత్యామ్నాయ, సహజ సిద్ధమైన తీయ్యదనం ఉండడం వలన ప్రత్యేకించి చక్కెర కలుపుకోవలసిన అవసరం లేదని అన్నారు. మధుమేహ వ్యాధికి సంబంధించిన ఉత్పాదనలు అధిక రేట్లలో ఉంటాయని, భావిస్తారని, అందరికీ అందుబాటులో ఉండే రేటులో ఈ స్టేవియా ఆకుల పొడి ఉంటుందని స్పష్టం చేశారు. అదేవిధంగా “గిరినార్” కంపెనీ నుండి వెలువడిన మరో ఉత్పాదన “డీ ట్యాక్స్” శరీరంలోని పలు రుగ్మతులను తగ్గిస్తుందని అన్నారు. అధిక శాతం ప్రజలు నిత్యం బాధపడే సమస్య మలబద్దకానికి కారణం మనిషి పొట్టలోని నులిపురుగులు.. ఈ డీ ట్యాక్స్ తీసుకోవడం ద్వారా నులిపురుగుల సమస్య నుంచి బయటపడవచ్చని.. అంతేకాకుండా మనిషిలోని ఒత్తిడిని తగ్గించి.. మానసిక ప్రశాంతతను కలుగుజేస్తుందని అన్నారు.ఈ విలేకరుల సమావేశంలో స్టోర్ ప్రతినిధులు అరవింద్, విజయకుమార్, వెంకట్, హరిహరరెడ్డి, సతీష్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *