కేరళ బాధితుల కు ఆదాల అనుచరుల బియ్యం సరుకుల సేకరణ

VARTHA VIHARI NEWS ✍ :: ? గోపి కృష్ణ వ‌డ్ల‌మూడి ? కేరళ వరద బాధితులకు సహాయం అందించాలని మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డి పిలుపు మేరకు ఆయన అనుచరులు 50 బస్తాల బియ్యం దుస్తులు సరకులను మాతంగి కృష్ణ వరదరాజుల రమేష్ నాయుడు పాశం శ్రీనివాసులు సేకరించారు. వాటిని మంగళవారం ఆదాల ప్రభాకర్రెడ్డి ద్వారా కలెక్టరేట్ కు పంపారు ఈ మేరకు ఆయన సరుకులతో నిండిన వాహనానికి పచ్చ జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక మంచి కార్యక్రమాన్ని చేసిన మాతంగి కృష్ణ రమేష్ నాయుడు శ్రీనివాసులు అభినందనీయులని తెలిపారు వారిని తాను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా నని చెప్పారు ఈ సందర్భంగా విజయ డైరీ ఛైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమం అందరికీ స్పూర్తిదాయకం కావాలని కోరారు బియ్యం సరుకుల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టిన మాతంగి కృష్ణ ఇది తనకు ఎంతో సంతృప్తి కలిగించిందని చెప్పారు ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు ఆనం జయకుమార్ రెడ్డి స్వర్ణ వెంకయ్య రమేష్ నాయుడు ఏసు నాయుడు పాశం శ్రీనివాసులు పరదేశి రఘురామయ్య గంగాధర్ సుధాకర్ అవినాష్ హరి బాబు యాదవ్ పాముల హరి కోటేశ్వర్ రెడ్డి నరసింహా రావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *