షకలక శంకర్‌పై శ్రీరెడ్డి ఫైర్‌..

VARTHA VIHARI NEWS :: ✍{వెంక‌ట‌సాయి}✍::  ఇటీవల టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్‌ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి, అంతకు మించి తన మాటలు, ట్వీట్స్‌, పోస్ట్‌లతో పలువురిపై నటి శ్రీరెడ్డి ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె కమెడియన్‌ షకలక శంకర్‌ను ఉద్దేశించి తన ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు చేశారు. అయితే హాస్య నటుడు షకలక శంకర్‌ హీరోగా, కారుణ్య కథానాయికగా, శ్రీధర్‌ దర్శకుడిగా పరిచయం చేస్తూ వై.రమణారెడ్డి, సురేష్‌ కొండేటి నిర్మించిన ‘శంభో శంకర’. సినిమా ఈ నెల 29న విడుదలైన విషయం తెలిసిందే.. ఈ సినిమా ప్రమోషన్‌ కోసం శంకర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై శ్రీ రెడ్డి స్పందిస్తూ.. మీ సినిమా పబ్లిసిటీ కోసం నా పేరు మద్యలో తీసుకొచ్చారంటే పళ్లు రాలగొడతానని తీవ్రంగా విరుచుకుపడ్డారు.

‘నేను ఎవరిని పొగుడుతూ.. వారిని ఓరేంజ్‌కి ఎత్తేసి వాళ్ల పేరు అడ్డు పెట్టుకొని ఇక్కడికి రాలేదు. అయితే ఇటీవల కొంత మంది భక్తులు.. ఓ హీరో భక్తులు.. ఆ హీరోకి తెలియంది ఏంటంటే అతని పేరు చెప్పుకొని అతన్ని దేవుడు.. మా కోసం ఎంతో చేస్తున్నాడు అం‍టూ.. మొత్తం మీద బతికేస్తున్నారు.. బతకండీ.. ఆ హీరో ఫ్యాన్స్‌ని వాడుకోండి. మీ సినిమా ఓపెనింగ్స్‌కి కావాలి కదా.. వాడుకోండి..  ఓపెనింగ్స్‌ కోసం ఆ హీరోని పొగడటం.. మీ ఊరు వచ్చినపుడు ఆయన్ని నెత్తిన పెట్టుకొవడం.. మీరు కూడా రాజకీయాల్లోకి రావడానికి ప్రయత్నించడం తప్పులేదు.. కానీ నా పేరు అనవసరంగా మద్యలో తీశారంటే మాత్రం పళ్లు రాలగొట్టి చేతిలో పెడతా… ఓ కమెడియన్‌వి హీరోగా ఇంట్రడ్యూజ్‌ అయ్యావు.. నీ పని ఏదో నువ్వు చూసుకో.. అందరిలాగా అవకాశాల కోసం రోడ్డున పడలేం కదా అంటూ ఓ పత్రికలో వార్త వచ్చింది. అందరికీ ఒకటే చెబుతున్నాను.. మీ ప్రొడ్యూసర్ ఏం గొప్పోడు కాదు..నువ్వేం పెద్ద గొప్పోడివి కాదు..  కథలు తీస్తే అందరి కథలు ఉన్నాయి మా దగ్గర.. సమయం వచ్చినపుడు అందరి కథలు బయటికొస్తాయి. నీ సినిమా ఓపెనింగ్స్‌ కోసం పెద్ద హీరోల పేర్లు తీసుకొని వ్యాపారం చేసుకోవడం మంచింది కాదు.. దాని కోసం నన్ను మద్యలో లాగటం కరెక్ట్‌ కాదు. నీ లాంటి పిచ్చ సినిమాలు నేను చూడను అని’  శ్రీరెడ్డి పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!