పొగాకు మ‌ర‌ణానికి కార‌ణం – అపోలో ప‌ల్మ‌నాల‌జిస్ట్‌ డాక్ట‌ర్ గౌరినాథ్

VARTHA VIHARI NEWS – ప్ర‌పంచ పొగాకు వ్య‌తిరేక దినోత్స‌వం సంద‌ర్భంగా నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిట‌ల్‌లో సీనియ‌ర్ ప‌ల్మ‌నాల‌జిస్ట్‌,డాక్ట‌ర్ గౌరినాథ్ విలేక‌ర్ల స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ పొగాకు ఉత్ప‌త్తుల వ‌ల్ల ప్ర‌పంచ వ్యాప్తంగా ల‌క్ష‌ల మంది ప్ర‌జ‌లు మ‌ర‌ణిస్తున్నార‌ని తెలిపారు.  90శాతం మంది 18ఏళ్ల యువ‌కులు స‌ర‌ద‌గా ప్రారంభించి, క్ర‌మంగా ధూమ‌పానానికి అల‌వాటు ప‌డుతుండ‌టం బాధ‌క‌ర‌మ‌న్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌తి ఏటా 60 ల‌క్ష‌ల మంది ప్ర‌జ‌లు పొగాకు ఉత్ప‌త్తులను ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌ర‌ణిస్తున్నార‌ని తెలిపారు. ప్ర‌పంచంలోనే భార‌తదేశం పొగాకు ఉత్ప‌త్తిలో 3వ‌స్థానంలో ఉన్న‌ప్ప‌టికీ, వినియోగంలా మాత్రం 2వ స్థానంలో ఉంద‌ని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ధూమపానం వల్ల క‌లిగే అన‌ర్ధాల‌ను తెలుసుకుని,దానిని విడ‌నాడేవారి సంఖ్య పెరుగుతున్న‌ప్ప‌టికీ ,భార‌త‌దేశంలో మాత్రం వారి సంఖ్య‌ చాలా త‌క్కువుగా ఉంద‌ని డాక్ట‌ర్ గౌరినాథ్ వెల్ల‌డించారు. దేశ‌వ్యాప్తంగా35శాతం మంది పెద్ద‌లు పొగాకు ఉత్ప‌త్తుల‌ను వాడుతున్నారని, అందులో 9శాతం మంది ధూమ‌పానం రూపంలో, 21శాతం మంది పొగాకు   న‌మ‌ల‌డం,  మ‌రో5శాతం మంది రెండింటిని చేస్తున్నార‌ని చెప్పారు. ఇందులో54శాతం మంది బిడిల‌ను తాగుతున్నార‌ని,  తెలియ‌జేశారు. పొగాకు పోగ‌లో 4వేల ర‌కాలకు పైగా కెమిక‌ల్స్ ఇంత‌వ‌ర‌కు గుర్తించ‌డం జ‌రిగింద‌ని, ఇందులో 50 ర‌కాల కెమిక‌ల్స్ క్యాన్స‌ర్ క‌లిగించే అవ‌కాశం ఉంద‌ని అన్నారు.  ధూమ‌పానం శ‌ర‌రీంలోని అన్నీ అవ‌య‌వాల‌ను ప్ర‌భావితం చేస్తుంద‌ని, 90శాతం మంది ఊపిరితిత్తుల క్యాన్స‌ర్‌కు గుర‌వుతూ మ‌ర‌ణిస్తున్న వారు పొగ‌తాగ‌డానికి అల‌వాటుప‌డ్డ‌వారేన‌ని డాక్ట‌ర్ గౌరినాథ్ వెల్ల‌డించారు. అదేవిధంగా పొగాకు ఉత్ప‌త్తుల వాడ‌కం వ‌ల్ల 40శాతం మంది వివిధ ర‌కాల క్యాన్స‌ర్ల‌కు గుర‌వుతుంటే, 42శాతం మంది ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న‌ట్లు వివిధ  స‌ర్వేల్లో వెల్ల‌డైంద‌ని స్ప‌ష్టీక‌రించారు. పొగాకు ఉత్ప‌త్తులు వాడ‌టం, పొగ‌తాగ‌డం వ‌ల్ల ఊపిరితిత్తుల వ్యాధులు, క్యాన్స‌ర్లు అధిక‌మ‌వుతాయ‌ని,అదేవిధంగా రోగ‌నిరోధ‌క శ‌క్తిని త‌గ్గించి, హృద‌య వ్యాధులు వ‌చ్చేందుకు అవ‌కాశం క‌ల్పిస్తాయ‌ని తెలిపారు. కేవ‌లం ధూమ‌పానం చేసే వారినే కాకుండా ప‌క్క‌న ఉన్న‌వారికి కూడా అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని,ధూమ‌పానం చేయ‌క‌పోయినా, ధూమ‌పానం చేసేవారి ప‌క్క‌న ఉన్న వారిలో 40శాతం మంది వివిధ ర‌కాల వ్యాధుల‌కు గుర‌య్యే ప్ర‌మాదం ఉన్న‌ట్లు అపోలో స్పెషాలిటీ వైద్యులు డాక్ట‌ర్ గౌరినాథ్ తెలిపారు. ముఖ్యంగా సిగిరెట్ పొగ పీల్చ‌డం వ‌ల్ల చిన్న‌పిల్ల‌ల్లో ఆస్మా, బ్రోకైటిస్‌, న్యూమోనియా వంటి వ్యాధులు ప్ర‌భ‌లుతాయ‌ని చెప్పారు. ధూమ‌పానం చేసేవారు ,ఆఅల‌వాటును వ‌దిలివేయ‌డం వ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాలు ఉన్నాయ‌ని, ధీర్ఘకాలికంగా, వారు వివిధ ర‌కాల జ‌బ్బుల బారిన ప‌డ‌కుండా మెరుగైన ఆరోగ్యాన్ని క‌లిగి ఉంటార‌ని తెలిపారు. ముఖ్యంగా పొగాకు ఉత్పత్తుల‌ను అమ్మే కంపెనీలు, వివిధ ప‌ద్ద‌త్తులో యువ‌త‌ను, ఆక‌ర్షించేందుకు అనేక ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయ‌ని, ధూమ‌పానం వ‌ల్ల హాని లేద‌ని కూడా చెప్పే ప‌రిస్థితులు ఉన్న‌ట్లు తెలిపారు. ధూమ‌పానం చేసేవారిలో  70శాతం మంది ధూమ‌పానం వ‌ల్ల కలిగే దుష్ ప్ర‌భావాల గురించి తెలిసి కూడా దానిని కొన‌సాగిస్తుంటార‌ని డాక్ట‌ర్ గౌరినాథ్ తెలిపారు.  పొగాకు ఉత్త్ప‌త్తుల వ‌ల్ల క‌లిగే హానికర ప‌రిణామాల‌ను  ప్ర‌జ‌ల‌కు వివ‌రించేందుకు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ప్ర‌తి సంవ‌త్స‌రం 1989 నుంచి మే 31వ తేదిన  దీనిపై అవ‌గాహ‌న క‌ల్పించేందుకు నిర్ణయించింద‌ని, అప్ప‌టి నుంచి నో టుబాకో డే రోజు మే  31న   పొగాకు ఉత్ప‌త్తులను వాడ‌టం వ‌ల్ల కలిగే అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను వివిధ కార్య‌క్ర‌మాల ద్వారా ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తున్న‌ట్లు తెలిపారు. ఇందులో భాగంగా 2018 ప్ర‌పంచ పొగాకు వ్య‌తిరేక దినోత్స‌వం సంద‌ర్భంగా పొగాకు ఉత్త్ప‌త్తుల వాడ‌కం,ధూమ‌పానం, వ‌ల‌న గుండె సంబంధిత వ్యాధుల‌పై ప్ర‌త్యేకంగా అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని  నిర్ణ‌యించార‌ని,ఆ దిశ‌గా నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిట‌ల్స్ ఆధ్వ‌ర్యంలో పొగాకు వాడకం వ‌ల్ల క‌లిగే అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తూ,వారిలో అవ‌గాహ‌న క‌ల్పిస్తున్న‌ట్లు తెలిపారు. పొగాకు వినియోగం వ‌ల్ల వ‌చ్చే గుండె పోటు వ్యాధి ఎక్కువ మంది ప్రజలను చంపుతుంద‌ని, అంతేకాకుండా, అధిక ర‌క్త పోటు,హృద‌య‌వ్యాధులు ఉన్న‌వారు ధూమ‌పానం, పొగాకు వాడ‌కం వ‌ల్ల రెండింత‌లు త్వ‌ర‌గా అనారోగ్యానికి గుర‌వుతార‌ని చెప్పారు.  భార‌త‌దేశంలో నానాటికి పెరుగుతున్న పొగాకు ఉత్ప‌త్తుల వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని, సెప్టెంబ‌ర్ 2000 సంవ‌త్స‌రం నుంచి సిగిరెట్‌,ఆల్క‌హాల్స్ ప్ర‌క‌ట‌న‌ల‌ను ప్ర‌భుత్వం నిషేదించింది. 2008అక్టోబ‌ర్ 2 నుంచి బ‌హిరంగ ప్ర‌దేశాల్లో దూమపానం నిషేదించార‌ని తెలిపారు. అంతేకాకుండా 2012 నుంచి ప్ర‌భుత్వం స్వ‌యంగా పొగాకు ఉత్ప‌త్తులను వాడ‌టం వ‌ల్ల క‌లిగే అనార్థాల‌పై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించేందుకు సినిమా,టివి మాధ్య‌మాల ద్వారా  ప్ర‌క‌ట‌న‌లు ఇవ్వ‌డంతోపాటూ,అనేక కార్య‌క్ర‌మాలు చేప‌డుతుంద‌ని అన్నారు. ప్ర‌భుత్వ లెక్క‌ల ప్ర‌కారం 2020 నాటికి 1.5 మిలియ‌న్ల మంది ప్ర‌జ‌లు పొగాకు వినియోగం వ‌ల్ల‌ చ‌నిపోయే ప్ర‌మాధామ్ ఉన్న‌ట్లు అంచ‌నావేశార‌ని అన్నారు. క‌ఠిన చ‌ట్టాలు అమ‌లు చేయ‌డం ద్వారా పొగాకు ఉత్ప‌త్తుల‌ను, నిషేదించ‌డం వ‌ల్ల చాలా వ‌ర‌కు మేలు జ‌రిగే అవ‌కాశాలు ఉన్నాయ‌న్నారు. అంతేకాకుండా ప్ర‌జ‌లు కూడా పొగాకు ఉత్ప్త్త‌త్తుల వ‌ల్ల క‌లిగే అనర్థాల‌పై అవ‌గాహ‌న క‌ల్పించుకుని, వాటికి దూరంగా ఉండ‌టం మంచిద‌ని అపోలో వైద్యులు డాక్ట‌ర్ గౌరినాథ్ సూచించారు. నెల్లూరు అపోలో స్పెషాలిటీ వైద్య‌శాల‌లో పొగాకు ఉత్ప‌త్తుల వ‌ల్ల క‌లిగే వ్యాధులకు ఆధునిక చికిత్సలు అందించ‌డంతోపాటూ, కౌన్సిలింగ్ కూడా నిర్వ‌హించి, ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించేందుకు కృషి చేస్తున్నాయ‌ని, ఈ అవ‌కాశాన్ని ప్ర‌జ‌లు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని నెల్లూరు అపోలో స్పెషాలిటీ  వైద్యులు,ప్ర‌ముఖ ప‌ల్మ‌నాల‌జిస్ట్ డాక్ట‌ర్ గౌరినాథ్ కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *