బీజేపీలోకి జేడీ లక్ష్మీనారాయణ

VARTHA VIHARI NEWS ::✍ {వెంక‌ట సాయి} ✍::  సీబీఐ మాజీ జేడీ వి.వి లక్ష్మీనారాయణ పొలిటికల్ ఎంట్రీ ఏంటనేది క్లియర్ అయింది. ఆయన బీజేపీలో చేరుతున్నట్లు స్పష్టమైన సమాచారం వచ్చింది. సంఘ్ పరివార్ నేతలతో ఆయన హైదరాబాద్ లో ప్రత్యేకంగా సమావేశం కావడం, ఆ పోటోలు లీక్ కావడమే ఇందుకు కారణం. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి జేడీని రంగంలోకి దించేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. అందుకే ఐపిఎస్  నుంటి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకునే దిశగా ఎత్తులు వేసిందంటున్నారు. జేడీ ఏ పార్టీలో చేరతారనే ప్రచారం వచ్చినా చివరకు ఆయన కమలం వైపు మొగ్గు చూపారని తేలడంతో ఆయన అనవసరంగా గుడ్ విల్ పాడుచేసుకుంటున్నారనే అనే చర్చ సాగుతోంది.
వాస్తవంగా జేడీ లక్ష్మీనారాయణకు తెలుగుదేశం, జనసేన, బీజేపీ నుంచి ఆహ్వానాలు అందాయి. అయినా సరే ఆయన చూపు కమలం పార్టీ వైపుకే మళ్లింది. ఏపీలో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ఎక్కువగా జేడీ మీద ఆశలు పెట్టుకుంది. ఆయన ఇప్పుడు జనాలను కలుస్తున్నారు. ఏపీకి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయనను ప్రచారం చేయించే ఆలోచన చేస్తోంది బీజేపీ. ఇదే విషయం పై కమలం పెద్దల్లో చర్చ సాగుతోంది. కన్నా లక్ష్మీనారాయణను ఏపీ బీజేపీ అధ్యక్షుడుగా చేసిన నేతలు ఇప్పుడు పార్టీ పురోగతి పై దృష్టి పెట్టింది. అసంతృప్తులను బుజ్జగిస్తోంది. హోదా విషయంలో చంద్రబాబు మాట్లాడిన మాటలు, చేతలను ప్రజల్లోకి తీసుకెళ్లే పని చేయనుంది. అంతే కాదు…కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్రం ఎలా ఖర్చు పెట్టింది. ఏంటనే విషయం పై దృష్టి సారించనట్లు తెలుస్తోంది.
ఆరెస్సెస్ వైపు నుంచి ఒత్తిడి పెరగడంతోనే బీజేపీ నేతలు జేడీ వైపు దృష్టి సారించినట్లు సమాచారం. కర్నాటక ఎన్నికల్లో బీజేపీకి మెజార్టీ సీట్లు రావడం వెనుక సంఘ్ పరివార్ చేతలు ఉన్నాయి. లేకపోతే మోదీ, షా టీమ్ ఢమాల్ మనేది. రెండు నెలలు ప్రజల్లో తిరిగి ఆ తర్వాత తాను పార్టీ చేరే విషయం పై నిర్ణయం తీసుకోనున్నారు లక్ష్మీనారాయణ. అప్పటి వరకు ఊహగానాలకు తెరపడక పోయినా బీజేపీ చేరుతుంది ఖాయం కావడంతో మిగతా పార్టీ జేడీ పై విమర్శలు ఎక్కు పెట్టే వీలుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *