పీకలదాకా మద్యం తాగి…చెవి కొరికి మింగేశాడు….

VARTHA VIHARI NEWS ::✍? {వెంక‌ట సాయి}✍? :: న్యూఢిల్లీ : పీకల దాకా మద్యం తాగిన ఓ యువకుడు మరో యువకుడితో వాగ్వాదానికి దిగి అతని చెవి కొరికి మింగిన ఘటన ఢిల్లీ నగరంలో వెలుగుచూసింది. ఢిల్లీలోని సుల్తాన్ పూర్ ప్రాంతానికి చెందిన కుమార్ డ్రైవరుగా పనిచేస్తున్నారు. కుమార్ అనే యువకుడు తన ఇంటి సమీపంలో రోడ్డుపై ఉండగా సంతోష్, దీపక్ లనే మరో ఇద్దరు వ్యక్తులు పీకల దాకా మద్యం తాగి వచ్చారు. గొడవకు దిగిన ఇద్దరు యువకుల్లో సంతోష్ ఉన్నట్టుండి కుమార్ చెవి కొరికి దాన్ని మింగేశాడు. స్థానికులు చూసి తీవ్రంగా గాయపడిన కుమార్ ను ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. కుమార్ తో పాత కక్షల వల్లనే అతని చెవి కొరికాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. మద్యం తాగి చెవి కొరికి మింగిన మందుబాబులను పోలీసులు అరెస్టు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *