కాకుటూరు వ‌ద్ద లారీ బొల్తా

V NEWS – నెల్లూరు జిల్లా వెంక‌టాచ‌లం మండ‌లం కాకుటూరు వ‌ద్ద మిని లారీ బోల్తా ప‌డింది. డ్రైవ‌ర్ నిర్ల‌క్ష్యం వ‌ల్లే ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. ఈ ప్ర‌మాదంలో డ్రైవ‌ర్ స్వ‌ల్ప గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. విష‌యం తెలుసుకున్న వెంక‌టాచ‌లం పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లాన్ని ప‌రిశీలించి, కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. అటు లారీ బోల్తాతో కొద్ది సేపు నేష‌న‌ల్ హైవేపై ట్రాఫిక్‌కు అంత‌రాయం క‌లిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *