కడప జిల్లాలో దారుణం.. బాలికపై అత్యాచారం

VARTHA VIHARI NEWS ::✍{వెంక‌ట సాయి}✍:: కడప: జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ బాలికపై ఇంటర్ చదువుతున్న ఇద్దరు విద్యార్ధులు అత్యాచారానికి పాల్పడ్డారు. ముళ్లపొదల్లోకి ఎత్తుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డట్టు గుర్తించారు. జిల్లాలోని బద్వేల్ మునిసిపాలిటీ పరిధిలోగల సుందరయ్య కాలనీకి చెందిన ఓ బాలికపై రమేష్, క్రిష్ణ అనే ఇంటర్ చదువుతున్న విద్యార్ధులు అత్యాచారానికి పాల్పడ్డారు. కాగా… ఈ విషయాన్ని ఆ బాలిక తన తల్లిదండ్రులకు ఈ విషయం తెలపడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి విద్యార్ధులను అరెస్ట్ చేశారు. అనంతరం బాలికను వైద్యచికిత్సల నిమిత్తం కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!