2 నెలలు శ్రీవారి ప్రత్యేక దర్శనాలు రద్దు

VARTHA VIHARI NEWS ::✍ {వెంక‌ట సాయి}✍:: తిరుమల: వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలకు విచ్చేసే భక్తుల రద్దీ దృష్ట్యా మే, జూన్‌ నెలల్లో శ్రీవారి ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. టీటీడీ గత ఏడాది ఆగస్టు నుంచి ప్రతి నెలా రెండు సామాన్య రద్దీ దినాలలో 4 వేల మంది వృద్ధులు, దివ్యాంగులు, 5 సంవత్సరాలలోపు చిన్నారులు, వారి తల్లిదండ్రులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం కల్పిస్తున్న విషయం తెలిసిందే. టీటీడీ తాజా నిర్ణయంపై భక్తులు సహకరించాలని ప్రజాసంబంధాల విభాగం అధికారి తలారి రవి కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!