ఏపీలో మద్యం వ్యాపారుల సమ్మె విరమణ

VARTHA VIHARI NEWS ::✍ {వెంక‌ట సాయి}✍:: విజయవాడ: ఏపీలో మద్యం వ్యాపారులు తమ సమ్మెను విరమించారు. బుధవారం ఉదయం ఎక్సైజ్‌శాఖ మంత్రి జవహర్‌ను కలిసిన మద్యం వ్యాపారులు మద్యం అమ్మకాల్లో ప్రభుత్వం ఇచ్చే ట్రేడ్ మార్జిన్‌ను పెంచాలని కోరారు. కమిషన్‌ను 15 నుంచి 18శాతానికి పెంచాలని కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న మద్యం వ్యాపారులు తమ డిమాండ్లను, సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. వీటికి సానుకూలంగా స్పందించిన మంత్రి సమస్యను పరిష్కరిస్తామని మంత్రి జవహర్ హామీ ఇచ్చారు. దీంతో 13 జిల్లాలో నిరసనను తక్షణం విరమిస్తున్నట్లు మద్యం వ్యాపారులు ప్రకటించారు. దీంతో ఏపీలో వారం రోజులుగా తగ్గిపోయిన మద్యం కొనుగోళ్లు నేటి నుంచి ఊపందుకోనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *